పోక్సో కేసులో షరతులతో విడుదలకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.1 లక్ష పూచీకత్తుతో పాటు కోర్టు విధించిన షరతులకు లోబడి ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా కేసు విచారణకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిందితుడు పూర్తిగా సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేయడం, ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయకూడదని ఆదేశించింది. అలాగే విచారణ సమయంలో కోర్టు నిర్దేశించిన అన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.

కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.