బ్లాక్ అండ్ వైట్‌లో మెరిసిన ఫరియా అబ్దుల్లా
నటి Faria Abdullah తాజాగా తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాల్లో ఫరియా అలనాటి తెలుగు సినీ కథానాయికలను గుర్తు చేసేలా సాంప్రదాయ లుక్‌లో మెరిసింది.
పెద్ద నల్ల బొట్టు, కాటన్ చీర, సింపుల్ మేకప్‌తో ఎంతో హుందాగా కనిపించిన ఫరియా తన సహజమైన అందంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోనోక్రోమ్ ఫ్రేమ్‌లు ఆమె లుక్కు మరింత క్లాసిక్ టచ్‌ను తీసుకొచ్చాయి.
ఈ ఫొటోలను చూసిన అభిమానులు "అలనాటి కథానాయికలా ఉన్నారు", "సింప్లిసిటీయే అసలైన అందం", "బ్లాక్ అండ్ వైట్‌లో మరింత అందంగా కనిపిస్తున్నారు" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
విభిన్న ఫోటోషూట్లతో తరచూ అభిమానులను అలరిస్తున్న ఫరియా అబ్దుల్లా, ఈసారి సంప్రదాయ శైలిలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
02 Jul 2026